ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత గడ్డ కడపలో జిల్లా పశు సంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న దళిత ఉద్యోగి అచ్చెన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అధికార వర్గాల్లో సంచలనం రేపింది. పదమూడు రోజుల క్రితం అదృశ్యమైన అచ్చెన్న శుక్రవారం అన్నమయ్య జిల్లాలో శవమై కనిపించాడు. అయితే డీడీ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందికి, తన తండ్రికి శాఖాపరమైన సమస్యలు ఉన్నాయంటూ అచ్చెన్న కుమారుడు క్లింటర్ చక్రవర్తి ఈ నెల 12న కడప వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన అచ్చెన్న శవమై తేలడం తీవ్ర కలకలం రేపింది. ఇది హత్యా, లేక ఆత్మహత్యా, లేక ప్రమాదవశాత్తా అన్నది మిస్టరీగా మారింది. అన్నమయ్య జిల్లాలోని రామాపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa