ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన పెన్షన్‌ విధానంపై పునసమీక్షకు కమిటీ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 10:55 AM

ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్లు సాగిస్తున్న పోరాటాల ఫలితంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నూతన పెన్షన్‌ విధానంపై పునసమీక్షకు కమిటీని ఏర్పాటు చేశారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ విజయవాడ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జీఎన్‌ శ్రీని వాసరావు అన్నారు. శుక్రవారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరిన ఉద్యోగులకు 2004 నుంచి నూతన పెన్షన్‌ విధానం అమలవుతోందన్నారు. నూతన పెన్షన్‌ విధానంలో పదవీ విరమణ చేసిన వారికి ఎలాంటి గ్యారంటీ పెన్షన్‌ లేకపోవటంతో నెలకు రూ.500 నుంచి రూ.1000 యాన్యు టీతోనే శేష జీవితం గడపాల్సి వస్తోందన్నారు. దీంతో ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎఫ్‌), సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీ ఆర్‌ఎంయూ)లు పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం పోరాట మార్గం పట్టాయని తెలిపారు. నూతన పెన్షన్‌ రద్దు చేస్తామన్న పార్టీకే వచ్చే జాతీయ ఎన్నికల్లో ఓటు వేయాలని తమ సంఘ జోనల్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరరావు పిలుపు ఇచ్చారని తెలిపారు. రైల్వే కార్మికుల దేశవ్యాప్త పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నూతన పెన్షన్‌ విధానం మీద ఫైనాన్స్‌ సెక్రటరీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయటం తమ సంఘాల కృషేనని శ్రీనివాసరావు తెలిపారు. పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం ఈనెల 31న ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రాతో విజ యవాడలో రైల్వే కార్మికుల సమావేశం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa