కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు, ఆధార్ లింక్ గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు తెలిపింది. మార్చి 31తో ఈ గడువు ముగియనుండగా, జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రేషన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోని వారు వెంటనే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ ను సందర్శించి లింక్ చేసుకోవాలని సూచించింది.