చిన్న అనారోగ్యం వచ్చినా కొందరు యాంటీ బయాటిక్స్ అధికంగా వాడేస్తుంటారు. అయితే, ఇది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. నోటి, గొంతు, జననేంద్రియాల సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయని పేర్కొంటున్నారు. వైద్యుల సలహా మేరకే యాంటీ బయాటిక్స్ వాడాలని అంటున్నారు.