కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్ రే మిషన్లపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. దిగుమతి చేసుకునే ఎక్స్ రే మిషన్లు, నాన్ పోర్టబుల్ ఎక్స్ రే జనరేటర్లపై సుంకం ప్రస్తుతం 10 శాతంగా ఉండగా, దీన్ని 15 శాతానికి పెంచింది. ఏప్రిల్ 1 నుండి పెరిగిన సుంకం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో దేశీయంగా తయారీని ప్రోత్సహించి, దిగుమతులను తగ్గిస్తుందని పేర్కొంది.