జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడం కోసం చాలా మంది వైద్యుల సలహా లేకుండానే ఎక్కువగా డోలో-650 వాడేస్తుంటారు. దీని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వికారం, లోబీపీ, కళ్లు తిరగడం, బలహీనంగా అనిపించడం, అతి నిద్ర, మలబద్దకం, నోరు ఎండిపోవడం వంటి రుగ్మతలు వస్తాయంటున్నారు. అలాగే, నాడీ వ్యవస్థపై ప్రభావం, గుండె దడ లక్షణాలు కనిపిస్తాయని దీన్ని అతిగా వాడకూడదంటున్నారు.