రాయగడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న కోయంబత్తూర్ స్పెషల్ రైలు నుంచి భిక్షాటన చేసుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తి జారిపడిపోయాడు. స్టేషన్ మాస్టారు ఎ.రామకృష్ణ 108 వాహనానికి సమాచారం అందజేశారు. సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్దారించారు. బొబ్బిలి రైల్వే పోలీసులకు సమాచారం అందజేయడంతో శవపంచనామా నిర్వహించిన పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి వికలాంగుడిగా గుర్తించారు.