‘‘జగన్‌రెడ్డి అరాచకాన్ని ఎలుగెత్తి చాటే ప్రతి బీసీ గొంతుకకు టీడీపీ అండగా నిలిచిపోరాడుతుంది. చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మేలు జరుగుతుంది’’ అని టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..... వచ్చే నెల 3 నుంచి మహానాడులోగా సాధికార సమితులు, జోనల్ రౌండ్‌టేబుల్ సమావేశాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీ జనార్దన్, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.