మంగళగిరి నగరంలోని ఎన్నారై వై జంక్షన్ వద్ద నేతన్న విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు లు మంగళవారం పరిశీలించారు. ఆగస్టులో జాతీయ చేనేత దినోత్సవం నాడు విగ్రహాన్ని ఆవిష్కరించుకునేలా పనులు చేయాలని ఎమ్మెల్యే కార్పోరేషన్ అధికారులకు సూచించారు. ఎన్నారై ఆస్పత్రి వద్ద నుండి వై జంక్షన్ వరకు ఇరువైపులా డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పోరేషన్ కమిషనర్ శారదా దేవి, డి. ఈ కృష్ణారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.