రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఎత్తివేయాలని ఎన్ ఎస్‌యూఐ కర్నూలు జిల్లా ఆధ్యక్షుడు వీరేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోని రాజు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... ప్రధాని మోదీ కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని కోరారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌కు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు జానార్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నూరుబాషా, కార్యదర్శి వెంకటేష్, భాస్కర్, చంద్రశేఖర్, అజయ్ పాల్గొన్నారు.