తిరుమలలో భక్తులు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా 10 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఒలెక్ర్టా సంస్థకు చెందిన రూ.18 కోట్ల విలువైన ఈ బస్సులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ టీటీడీకి విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తిరుమలలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ వాహనాల స్థానంలో దశలవారీగా ఎలక్ర్టిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. మొదటిదశలో తిరుమలలో అధికారులకు 35 ఎలక్ర్టిక్ కార్లను ఇచ్చామన్నారు. ఆర్టీసీ తిరుమల-తిరుపతి మధ్య 65 ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతోందన్నారు. తిరుమలలోని వర్క్ షాప్ లో ఎలక్ర్టిక్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ బస్సులు నడిపేందుకు టీటీడీ డైవర్లకు ఒలెక్ర్టా సంస్థ శిక్షణ ఇస్తుందని, ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం తదితరులు ఎలక్ర్టిక్ బస్సుల్లో ప్రయాణించి ట్రయల్ రన్ నిర్వ హించారు. ఒలెక్ర్టా సంస్థ సీఎండీ ప్రదీప్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa