ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం బయల్దేరిన ఏపీ సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 08:35 PM

విశాఖపట్నంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు జీ20 సదస్సు జరగనుంది. జీ20 దేశాలు, యూరప్ నుంచి 57 దేశాల ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు. ముందుగా జీ20 దేశాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఘనంగా విందు కార్యక్రమానికి హాజరవుతారు. జీ20 దేశాల ప్రతినిధులకు గ్రాండ్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ విందు అనంతరం సీఎం జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa