మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.నేడు ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలో సీబీఐ అధికారులు అవినాష్‌ను విచారణకు పిలిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.