పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఆ మేరకు పలుమార్లు గడువు పొడిగించారు. తాజాగా కేంద్రం పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును మరోసారి పొడిగించింది.ఈసారి మరో మూడు నెలలు పొడిగిస్తూ, జూన్ 30న తుది గడువు అని పేర్కొంది. అప్పటికి పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, జూలై 1 నుండి పాన్ కార్డ్ పని చేయదు. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చేందుకు పాన్-ఆధార్ లింకింగ్ గడువును పొడిగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వివరించింది.