తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి నేడు లేఖ రాశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన పేరిట ప్రత్యేక నాణేన్ని విడుదల చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈ లేఖ రాశారు.ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణేన్ని విడుదల చేయడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సంతోషం వ్యక్తం చేసింది.