ప్రొద్దుటూరు మండల పరిధి నంగనూరు పల్లె రోడ్డులోని మదర్ థెరీసా సేవా వృద్ధాశ్రమానికి ఆర్కె హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి సహకారంతో మీకోసం సేవా సంస్థ ఆధ్వ్యంలో రూ. 20 వేలు విలువైన నిత్యావసర వస్తువులను మంగళవారం సాయంత్రం పట్టణ టూ టౌన్ సీఐ ఇబ్రహీం చేతుల మీదుగా ఆశ్రమానికి అందజేశారు. కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ అధ్యక్షుడు పుల్లగూర విష్ణు వర్ధన్, మహమద్ బాషా, లక్ష్మి ప్రసన్న, ఆశ్రమ నిర్వాహకుడు కంచన రాజేష్, తదితరులు పాల్గొన్నారు.