నెదర్లాండ్ కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రియ్యాడు. కానీ, అదే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ది హేగ్ నగరానికి చెందిన జొనథన్ ఎం(41) ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్ లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. దీంతో ది నెదర్లాండ్ ప్రభుత్వం అతడిని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది.