ప్రస్తుతం హెయిర్ కలరింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. అయితే, మీ జుట్టు రకం, ఆకృతి బట్టి రంగు ఎంచుకోవాలని లేకుంటే జుట్టు సమస్యలతో పాడయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ స్టైలిస్ట్ సాయంతోనే జుట్టుకు కలర్ వేయించుకోవాలి. జుట్టు తరచూ స్టైలింగ్ చేయించడం మానుకోవాలి. హెయిర్ కలర్ వాడుతుంటే షాంపూలు, కండిషనర్స్ వాడకూడదని పేర్కొంటున్నారు.