రాజస్థాన్ లో ప్రైవేట్ మెడికల్ సిబ్బంది రోడ్డెక్కారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య హక్కు బిల్లుకు నిరసనగా ఆందోళన చేశారు. అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో ప్రైవేట్ వైద్యులు జైపూర్ లో సమావేశమయ్యారు. దాదాపు 50 వేల మంది వైద్య, పారా మెడికల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉచిత అత్యవసర చికిత్స అందించాలి.