ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిని కొట్టి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కుమారుడును మంగళవారం ఉమ్మడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆగిరిపల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు అరెస్టు చేశారు. నూగొండపల్లి గ్రామానికి చెందిన కందుల లక్ష్మి పెద్దకుమారుడు ఆస్తి విషయమై తల్లితో గొడవపడి ఆమెను కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గత ఏడాది డిసెంబరులో జరిగింది. నిందితుడు శివరామకృష్ణను మంగళవారం అరెస్టుచేసి నూజివీడు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.