పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకానగర్‌లో గల పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, సీపీఎం, లోక్‌సత్తా, కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీల నేతలు, మేధావులు పాల్గొని ప్రసంగించారు. కాగా, పోలవరం ప్రాజెక్టును తక్షణమే పూర్తిచేసి నిర్వాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ చేపట్టిన రెండు రోజుల సామూహిక దీక్ష సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును డిజైన్ ప్రకారం నిర్మించి ప్రజలకు మేలు చేస్తారో, బ్యారేజ్‌లా మార్చి తన తండ్రి వైఎ్‌సకి పంగనామాలు పెడతాడో సీఎం జగన్ తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.