ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు దాచుకున్న రూ. 2,400 కోట్ల సొమ్మును లిక్కర్ బాండ్స్ ద్వారా ఇవ్వాలంటూ ఆ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తమకు సమాచారం ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి.రెడ్డి తెలిపారు. అదే జరిగితే ఆ రెండు సంస్థల ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని అయన పేర్కొన్నారు. సీఎం జగనే అమ్ముకుంటున్నారని నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో 18 రీచ్‌లకు రూ. 18 కోట్లు ఫైన్ వేస్తూ ఇటీవల ఎన్‌జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని, ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన రీచ్‌లకు రూ. కోటి చొప్పున చెల్లించాల్సి వస్తే రాష్ట్రంలో రూ. 450 కోట్లు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఇసుక మొత్తం సీఎం అమ్ముకోవాలి.. ఎన్‌జీటీకి ప్రజల సొమ్ము ఫైన్‌గా చెల్లించాలా అని ప్రశ్నించారు.