ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్ దయనీయ దుస్థితికి రావడానికి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వమే కారణమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని ఒకసారి కూడా ప్రధానమంత్రి దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. లక్షలాది మందికి ఉపాఽధి కల్పిస్తూ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని లెనిన్‌బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి నరేంద్రకుమార్, నమ్మి సింహాద్రి, పి. శ్రీనివాస్, ఎం. రఘుప్రసాద్, ఎం. అప్పలనాయుడు, కిరణ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.