వ్యవసాయ కళాశాల నైరా వారి ఆద్వర్యంలో జాతీయ సేవా పథకం క్రింద ఏడవ రోజు కార్యక్రమంలో బాగంగా వ్యవసాయ కళాశాల డీన్ డా. డి. శ్రీనివాస్ గఅధ్యక్షతన ఉద్యాన పంటలలో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్య పద్ధతులు పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి ఆర్. వి. వి ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యాన శాఖలో అందుబాటులో ఉన్న వివిధ పథకాలు గురుంచి రైతులకు వివరించారు. కళాశాల ఉద్యాన విభాగం నుండి డా. యం. లక్ష్మీదుర్గ వివిధ తీగజాతి కూరగాయలు యాజమాన్య పద్ధతులు, పోషకాహారoలో కూరగాయల ప్రాముఖ్యత గురుంచి వివరించారు. ఈ కార్యక్రమం లో ఎన్. యస్. యస్ ఆఫీసర్స్ డా. జి. యస్ రాయ్, డా. శ్రీ సంధ్య గారు, వ్యవసాయ కళాశాల ఆచార్యులు కళాశాల విద్యార్ధులు , సర్పంచ్ రంధి అప్పలస్వామి యం. పి. టి. సీ నాగేశ్వరరావు, వి. ఏ. ఏ లావణ్య, రైతుల పాల్గొన్నారు.