వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని, అదనపు ఛార్జ్ షీట్ వేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది. ఈ కేసు దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది.