ఓ యువతి 21 ఏళ్లకే నగర మేయర్ గా ఎన్నికైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బళ్లారికి చెందిన త్రివేణి అనే 21 ఏళ్ల యువతి నగర మేయర్ గా ఎన్నికై రాష్ట్రంలో అత్యంత పిన్నవయస్కురాలు అయిన మేయర్ గా నిలిచారు. నేడు జరిగిన బళ్లారి మహానగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా త్రివేణి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 44 ఓట్లు ఉండగా, 28 ఓట్లు త్రివేణికి వచ్చాయి.