ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి రైల్వే గేట్ వద్ద ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్, పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.