వారణాసిలోని పవిత్ర గంగా నది ఒడ్డున మణికర్ణిక ఘాట్లో అశ్లీల నృత్యాల ప్రదర్శన కలకలం రేపింది. మహాశంషాన్ నాథ్ బాబా మూడు రోజుల వార్షిక కార్యక్రమం చివరి రోజున మంగళవారం రాత్రి ఈ ప్రదర్శన నిర్వహించారు. డ్యాన్స్ ప్రదర్శనను వీక్షించే వారు మహిళా డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. కాగా మణికర్ణిక ఘాట్లో అశ్లీల నృత్యాలపై స్ధానికులు, భక్తులు అధికారుల తీరును తప్పుపడుతున్నారు.