తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బాపులపాడు మండలం వీరవల్లీ నందు ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ కార్యదర్శి , తోమ్మండ్రు జోజి ప్రతాప్ , గ్రామ పార్టీ అధ్యక్షులు లంక బాబు సురేంద్ర మోహన బెనర్జీ , టిడిపి రాష్ట్ర నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్ కలిసి టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదవాడి ఆశలకు, ఆకాంక్షలకు పునాది పడిన రోజు, తెలుగు చలనచిత్ర సీమలో రారాజు వెలుగొందుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించి, ఆరోజు వరకు ఢిల్లీ పెత్తందార్లు పాదాల క్రింద నలిగిపోతున్న తెలుగు వారి ఆత్మగౌరవం సాక్షిగా, అతి తక్కువ కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి, సంక్షేమం అనే పదానికి తెర తీసి, అభివృద్ధి అనే పదానికి అర్థం చెప్పిన ప్రభుత్వాన్ని నడిపి చూపిన వారు ఎన్టీఆర్, నేటికీ ఆ మహానుభావుడు పార్టీ స్థాపించి 41వ సంవత్సరాలు, ఆయన అశయ సాధనలో, నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో నేటికీ ప్రతి కార్యకర్త పేదోడి సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతునేవున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారందరూ ఐక్యంగా బలంగా ఉన్నదే తెలుగుదేశం పార్టీని బలహీన పరచడానికి జాతీయ పార్టీల కుట్రలో భాగంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నిలిచింటుంది, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి తోమండ్రు జోజీ, పార్లమెంటరీ తెలుగు యువత నాయకులు మండాది రవీంద్ర, గ్రామ ఉపసర్పంచ్ లంక అజయ్ , గ్రామ ప్రముఖులు లింగంనేని శ్రీనివాసరావు(చిన్ని), గుండపనేని వేణు గోపాల్, వేగుంట మల్లికార్జునరావు , నందమూరి గోపాలరావు, బుగ్గ శివ, అలుగుల దేవానంద్, పిల్లా అదృష్టరావు, మోర్ల జగన్నాధం , నందమూరి సత్యనారాయణ , యర్రరాపు శేషగిరి , గుండపనేని రాజేష్ , చిలకంటి రమేష్, ఖగ్గా సాయి , పలువురు తెలుగు యువత నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.