టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రీ సీతారాముల చల్లని దీవెనలతో ప్రజలందరూ పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి పాలించిన వారే నిజమైన పాలకులని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పారు. ధర్మం, సేవ అనే గుణాలతో కూడిన శ్రీరాముని బాట అనుసరనీయం. మానవాళికి శ్రీరాముని జీవితం ఆదర్శప్రాయం. ప్రజలందరికీ శ్రీరాముడిని చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ’’ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.