యువత శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ క్రీడాకారిణి, ఎన్‌ఐఎస్ కబడ్డీ కోచ్ పోతినేని పద్మజాబాల అన్నారు. తేలప్రోలులోని ఉషారామా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం 15వ వార్షిక క్రీడా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పద్మజాబాలతోపాటు ఎముకల వైద్యుడు కాకర్ల గోపీకృష్ణ హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి క్రీడాపోటీలను ప్రారంభించిన పద్మజాబాల మాట్లాడారు. రన్నింగ్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడల్లో తమ ప్రతిభను చాటి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందించారు. కళాశాల ఎనిమిది విభాగాలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, డైరెక్టర్ కుర్రా రాజశేఖరరావు, ప్రిన్సిపాల్ జీవీకేఎస్‌వీ ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కె.సత్యనారాయణ విజేతలను అభినందించారు.