ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న లైవ్ ట్రాకింగ్ సిస్టం కాంట్రాక్ట్ కాలపరిమితి ఈనెల 31తో ముగుస్తున్నందున కొత్త ప్రాజెక్టు యూటీఎస్ను ఏప్రిల్ 1 నుంచి వినియోగంలోకి తెస్తున్నామని ఆర్టీసీ ఐటీ అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడు చేసుకుని మార్పులు, అప్డేట్ చేసుకోవాలని సూచించారు.