యువగలం పాదయాత్రలో భాగంగా పేదరకం లేని రాష్ట్రమే తన ఆశయమని నారా లోకేశ అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కనకదాస జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు. కనకదాస పీఠం ఏర్పాటుకు కృషిచేస్తామని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని, ఉప కులాలకు సాధికారిక సమితులు ఏర్పాటు చేసి రాజకీయంగా ప్రోత్సహించామని అన్నారు. వాల్మీకులకు రాజశేఖర్రెడ్డి ఫెడరేషన ఏర్పాటుచేసి నిధులు ఇవ్వలేదని అన్నారు. ఎస్టీలకు ఎలాంటి నష్టంలేకుండా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేందుకు కృషిచేస్తామని అన్నారు.