ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నిస్తే వేటు వేస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 30, 2023, 12:59 PM

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్యంపై అనర్హత వేటు వేయడం దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయమని ఆపార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రామ్‌చరణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దాదాగాంధీతో పాటు ఏఐసీసీ సభ్యుడు శంకర్‌, జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి హాజరై మాట్లాడారు. దాదాగాంధీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే రాహూల్‌గాంధీపై అనర్హత వేటు వేస్తారా? అని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీకి ప్రజాదరణ పెరుగుతుండటంతో పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఫజులుల్లా, నజీర్‌ అహమ్మద్‌, శర్మాస్‌ వలి, పరమేశ్వరరెడ్డి, కవిత నిర్మల పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com