పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత వరికూటి అమృతపాణితో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో తనకు టి క్కెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పని చేస్తామన్నారు. ఇటీవల తన తల్లి చనిపోతే సీఎం జగన్మోహన్రెడ్డి పరామర్శించేందుకు వస్తే దానిని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.