చిత్తూరు జిల్లాలోని 300 ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... భూపంపిణీకి అర్హులైన వారందరికీ పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై సమావేశాలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సాంఘికసంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మికి సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వివిధ కోర్టుల్లో వివిధదశల్లో విచారణలో ఉన్నాయని ఏఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ తులసి, ఐసీడీఎస్ పీడీ నాగశైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు, ఆర్డీవోలు రేణుక, సుజన, శివయ్య, డీఎస్పీలు, డీవీఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.