నెల్లూరు జిల్లా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఆయనకు వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఉదయగిరికి వచ్చారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కుర్చీలో కూర్చున్న ఆయనను... తన్ని తరిమికొడతామని చెప్పి రావాలని సవాల్ విసిరారు.ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మేకపాటి చంద్రశేఖర్ ఓటు వేశారనే కారణంతో వైసీపీ నుంచి అయన సస్పెన్షన్కు గురయ్యారు.