ఏపీలోని విజయవాడలో వేడినీళ్ల బకెట్లో పడి పసిబిడ్డ మృతి చెందింది. లంబాడీపేటలో ప్రణతి, ప్రేమ్‌కుమార్ దంపతులు తమ 8 నెలల పాప ప్రఖ్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న పాప పడుకున్న మంచం పక్కనే బకెట్లో వాటర్ హీటర్ పెట్టి తల్లి బయటకు వెళ్లింది. పాప ఏడుపు విని తల్లి పరుగున వచ్చి చూడగా చిన్నారి వేడినీటి బకెట్లో పడిఉంది. శరీరమంతా కాలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న మరణించింది.