ఆఫ్రికాలో ఓ కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది. బురుండిలోని బజిరో ప్రాంతంలో వైరస్ సోకిన వారి ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి 24 గంటల్లోపే మరణిస్తున్నారు. ఇప్పటికే ఇలా ముగ్గురు చనిపోయారు. దీని బారిన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, నీరసం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ లక్షణాలతో ఆస్పత్తుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం పట్టణంలోని ప్రజలంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.