చెమట సమస్య ఎక్కువగా ఉన్న వారు నీళ్లు అధికంగా తాగడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అరటి, గుడ్లు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు. పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు తింటే శరీర దుర్వాసన ఉండదంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్స్ వెనిగర్, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే చెమట ఎక్కువగా రాదు.