అమరావతిలోని మందడంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. బీజేపీ నేత కారుపై రాళ్లదాడితో ఈ ఉద్రికత్తవాతావరణం చోటు చేసుకొంది. ఇదిలావుంటే 1200 రోజుల అమరావతి ఉద్యమానికి.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు పలికారు. ఆ తర్వాత మందడం శిబిరం నుంచి తుళ్లూరులోని పార్టీ నాయకుడిని పరామర్శించడానికి వెళ్లారు. అక్కడి నుంచి సత్యకుమార్ తిరిగి వస్తుండగా.. మందడం మూడు రాజధానుల శిబిరం వద్ద సత్యకుమార్ కాన్వాయ్‌లోని కార్లపై దాడి జరిగింది. ఈ ఘటనలో బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అంతుకు ముందు మందడంలో సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు నమ్మబలికి.. గెలిచిన తర్వాత మోసం చేసిన జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. మొక్కవోని దీక్షతో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఆయన అభినందించారు. అమరావతి రైతుల పోరాటానికి విజయం తథ్యమని రైతులకు భరోసా ఇచ్చారు. ఇదే కార్యక్రమానికి.. ప్రత్యేక అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు.