రాజంపేట బార్ అసోసియేషన్ లో సభ్యత్వ రుసుము చెల్లించినప్పటికీ 24 మంది న్యాయవాదుల ఓట్లను బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ తొలగించారని దళిత న్యాయవాది కే ప్రభాకర్ రావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ తమ ఫ్యానల్ అభ్యర్థులే గెలుపొందాలన్న దురుద్దేశంతో ఓటు హక్కును తొలగించారని అన్నారు. న్యాయవాదులు కోర్టును ఆశ్రయించామన్నారు. దళితుల ఓటు హక్కు తొలగించడం పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ నరసింహారావు అన్నారు.