బంగారం అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు అంకెల కోడ్ (HUID) లేకుండా హాల్ మార్క్ చేసిన ఆభరణాలు, కళాఖండాల సేల్స్‌ను నిషేధించింది. ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఇవాళ్టి నుంచి HUIDతో ఉన్న బంగారు ఆభరణాలకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఉంటుంది. దీనిని వ్యాపారులు, వినియోగదారులు తప్పక పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.