గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళ శుక్రవారం విషపుద్రావకం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్ప డింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. ఆ గ్రామా నికి చెందిన భాగ్యలక్ష్మి గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడు తోందన్నారు. దీంతో ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో విషపు ద్రావకం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సలు అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘ టనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.