పల్నాడు జిల్లాలో మార్చి నెలలో సాధారణ వర్షపాతానికి మించి మూడు రెట్లు అధిక వర్షం నమోదయింది. మార్చి నెలలో 249. 6 మి. మీ సాధారణ వర్షం కాగా 1021. 0 మి. మీ వర్షం కురిసింది. జిల్లాలోని 28 మండలాలలో సగటున 8. 9 మి. మీ పడాల్సి ఉండగా 36. 5 మి. మీ కురిసిందని వాతావరణ శాఖ విభాగం శుక్రవారం తెలిపారు. నాదెండ్ల మండలంలో సాధారణ వర్షం రెండు మి. మీ కాగా అత్యధికంగా 82. 4 మి. మీ వర్షం పడిందని తెలిపారు.