శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలోని కాలుపల్లి సమీపంలో ఉన్న నిషా గార్మెంట్స్ పరిశ్రమ నుండి వచ్చే కెమికల్ పైప్లైన్ ద్వారా వచ్చే కెమికల్‌ను వేస్టేజ్ పదార్థాన్ని ఊరి చివరి ప్రాంతంలో కానీ డంపు ఏరియాకు గాని తరలించాలి. అయితే యాజమాన్యం మాత్రం ఆ కెమికల్ పదార్థాన్ని పైప్ లైన్ ద్వారా నదీ ప్రాంతంలోకి తరలించడం గ్రామస్తుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిషా గార్మెంట్స్ పరిశ్రమ యాజమాన్యం పైపులైన్ ద్వారా ఫ్యాక్టరీలోని వ్యర్థపదార్థాలను సరఫరా చేస్తున్నారో లేక ఈ పదార్థాలు నది ప్రాంతంలోకి రావడంతో వచ్చే నీరు కెమికల్ తో విలీనమైతే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై యాజమాన్యం ఏ మాత్రం స్పందించకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నిషా గార్మెంట్స్ యాజమాన్యం స్పందించి పైప్ లైన్ ను మరమ్మతులు చేసి డంపు ఏరియాకు కెమికల్ ను తరలించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.