రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించే సత్తా దళితులు, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉందని రాయలసీమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీస్ ప్రజా సేవా సంఘం అధ్యక్షుడు ఆలం నవాజ్ అన్నారు. శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని ఆ సంఘం కార్యాల యంలో కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వర్గాలు రాజకీయంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వారిలో అవగాహన పెంచడానికి సంఘ సభ్యులు అందరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం వ్యవస్థాపకుడు ఆలం నవాజ్ అధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా ఎం. మహేంద్ర, కార్య దర్శిగా పప్పూరు బాషా, ముఖ్య సలహాదారుగా గాలి మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నరసన్న, రామాంజి నేయులు, సహాయ కార్యదర్శిగా షేక్ జిలాని, రాధాకృష్ణ, కోశాధికారులుగా రామచంద్ర, శ్రీనివాసులును ఎంపిక చేశారు. అదేవిధంగా పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమిం చారు.