త్రిపురాంతకం మండలం మెడపి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వి. చంద్రమౌళి (55) స్థానికంగా ఉండే ఓ బేకరిలో పని చేసేందుకు నెల రోజుల క్రితం మేడపి వచ్చాడు. శనివారం ఉదయం బేకరికి వచ్చే క్రమంలో మేడపి బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం బస్సు కిందికి వెళ్లడంతో చంద్రమౌళికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa