ఏపీ సీఎం జగన్ సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఇప్పటికే ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిన సీఎం ఈ కార్యక్రమంపై రేపు ఎమ్మెల్యేలు, మంత్రులతో సమీక్షించనున్నారు. ఈ భేటీలో 2024 ఎన్నికలకు సంబంధించి కేడర్‌కు దిశ నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరికి వార్నింగ్ ఇస్తారేమో చూడాలి.