భారత్- చైనా సరిహద్దుల్లో గత కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది నుండి ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయని తెలిపింది. భారత్ తో స్థూల ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి ట్రాక్ లోకి వస్తున్నాయని కోల్ కతాలో చైనా కాన్సుల్ జనరల్ జా లియో తెలిపారు. ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.